అమలాపురం: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ అమలాపురం మండల విఆర్ఏ లు గురువారం అమలాపురం గాంధీ విగ్రహం సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా విఆర్ఏ పే స్కేల్ అమలు చేయాలని, విఆర్ఏ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, నామినీ విఆర్ఏ లను క్రమబద్ధీకరించాలని, అర్హులైన విఆర్ఏ ప్రమోషన్లు కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి తమ వినతిపత్రాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో అమలాపురం మండల విఆర్ఏ లు పాల్గొన్నారు.
