రావులపాలెం లో కొవ్వూరి జగదీశ్వర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయ సాయి రెడ్డి

సాదిక్ పై తీవ్ర ఆరోపణలు.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి

కుటుంబాల ఆస్తులపై కన్ను..

బెదిరింపులు, మత మార్పిడి ఒత్తిళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలి.బాధిత కుటుంబాలకు భద్రత కల్పించాలి..

అవసరమైతే సీబీఐకి కేసు అప్పగించాలి: విజయ్‌సాయి రెడ్డి

లవ్ జీహాద్ నినాదంతో దేశాన్ని నాశనం చేస్తున్నారు





రావులపాలెం, సత్యం టీవీ:కాకినాడ, రాజమహేంద్రవరం పరిసరాల్లో కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని సాదిక్‌ నేతృత్వంలో వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయి రెడ్డి డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాల ఆస్తులు, బంగారం, నగదు, బ్యాంకు లాకర్ల బదలాయింపులపై విచారణ జరపాలని, నూకరాజు కుటుంబం సహా పలువురి మృతులపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. జగదీశ్వర్‌రెడ్డి మృతిపైనా పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలను పరిశీలించాలని అన్నారు.

బాధిత కుటుంబాలకు, ముఖ్యంగా బాలుడు రియాన్ష్‌రెడ్డికి తక్షణ భద్రత కల్పించాలని కోరారు. మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో పాటు సుమారు 15 కుటుంబాల ఫిర్యాదులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

స్థానిక దర్యాప్తుపై అనుమానాలు ఉంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించాలని విజయ్‌సాయి రెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.లవ్ జీహాద్ నినాదంతో దేశాన్ని నాశనం చేస్తున్నారనీ విరుచుకు పడ్డారు.