పల్లె నిద్ర లో భాగంగా కాట్రేనికోన ఎస్ ఐ



డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ పరిధిలోని వెట్లపాలెం శివారు గ్రామంలో కాట్రేనికోన ఎస్సై దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన "పల్లె నిద్ర" కార్యక్రమం ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి రాత్రి బస చేసి, పలు కీలక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉంటు యువత డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు.మహిళల రక్షణ, భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత.ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజల సహకారం అందించాలని తెలిపారు అనంతరం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఎస్సై దుర్గా శ్రీనివాస్ కోరారు.